ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఘనంగా 2K రన్

వికారాబాద్‌, అర్జున్ సమాచారం:
భారతదేశ ఐక్యత, సమగ్రత, సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని, జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా శనివారం
వికారాబాద్ పట్టణంలో 2K రన్ నిర్వహించారు.
యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ రన్‌లో జిల్లా కలెక్టర్  దీపక్ తివారి,జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, , అదనపు ఎస్పీశ్రీ రాజేష్ మీనా,  వికారాబాద్ డీఎస్పీ రీ అంజయ్య, ఏఆర్
డీఎస్పీ రీ వీరేష్  వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్  రఘు కుమార్రు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు, యువతులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు ఉత్సాహంగా
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్రా, మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను ఏకం చేసి భారతదేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను
స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జాతీయ భావనతో ముందుకు సాగాలని,
యువత దేశాభివృద్ధిలో భాగస్వాములై ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్  దీపక్ తివారి,  మాట్లాడుతూ, జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని తెలిపారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ,
సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని
పిలుపునిచ్చారు.
ఈ 2K రన్ ద్వారా దేశ ఐక్యత, సోదరభావం, జాతీయ సమైక్యత ప్రాముఖ్యతను ప్రజలకు చాటిచెప్పారు. దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా
నిర్వహించారు.